కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరబోతున్నారు – వైసిపి ఎంపీ

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న మాట నిజమేనని రఘురామకృష్ణ రాజు అన్నారు. సర్వే అంచనాల ప్రకారం కాంగ్రెస్ బలపడినట్లుగా తెలుస్తోందని, సర్వే అంచనాలే నిజమైతే, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అన్నారు రఘురామకృష్ణ రాజు. కర్ణాటకలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో పుంజుకున్నట్లే, ఆంధ్ర ప్రదేశ్ పై దృష్టి సారించనుందని, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కాస్తా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీగా మారిందని చెప్పారు.

ఆంధ్ర ప్రదేశ్ లోనూ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం ఖాయం అని అన్నారు. ప్రస్తుతం ఒక్క శాతంగా ఉన్న ఓట్లను 8 శాతానికి పెంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదని, ఒక్కొక్క శాతం కాంగ్రెస్ పార్టీకి పెరిగే ఓట్ల శాతం తమ పార్టీకి సమ్మెట దెబ్బ కానుందని, కాంగ్రెస్ పార్టీకి తన తండ్రి పేరు పెట్టుకుని జగన్ మోహన్ రెడ్డి గారు కబ్జా చేశారని రఘురామకృష్ణ రాజు అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు ద్వారా జగన్ మోహన్ రెడ్డి నవ్వుల పాలయ్యారేమోనని ప్రజల ప్రతిస్పందన చూస్తే అర్థమవుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version