వచ్చే ఎన్నికల్లో మచిలీ పట్నం నుంచే పోటీ చేస్తా – వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి

-

వచ్చే ఎన్నికల్లో మచిలీ పట్నం నుంచే పోటీ చేస్తానని ప్రకటన చేశారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి. అభ్యర్థుల మార్పు అనేది పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ తీసుకునే నిర్ణయం అన్నారు. అన్నీ ఆలోచించే జగన్ నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి. సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని వివరించారు.

YCP MP Vallabhaneni Balashauri on mp elections

ఇవాళ కృష్ణా జిల్లాలో మీడియాతో మాట్లాడారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి. ఈ సందర్భంగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ.. ఏప్రిల్ 2న వరకు దేశ వ్యాప్తంగా CBSE పదో తరగతి పరీక్షలు జరుగుతాయన్నారు. ఏప్రిల్ 2 వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఏప్రిల్ 2 తర్వాత గతంలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి కాబట్టి మళ్లీ ఇంచు మించు అలానే జరుగుతాయి అనేది నా వ్యక్తిగత అభిప్రాయమన్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి. ఈ మధ్యలో ఏమన్నా అద్భుతం జరిగితే చెప్పలేమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version