రూ.2000 నోట్ల రద్దుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. రూ.2000 నోట్ల రద్దును స్వాగతిస్తున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ మేరకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. నల్ల ధనాన్ని అరికట్టే చర్యలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని వివరించారు విజయసాయి రెడ్డి.
అందులో భాగంగానే రూ.2000 నోట్లను రద్దు చేయాలన్న ఆర్‌బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్ విజయసాయిరెడ్డి. ఈ మేరకు ట్వీట్ చేశారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్ విజయసాయిరెడ్డి. కాగా, 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. మే 23 నుండి సెప్టెంబర్ 30 వరకు 2000 రూపాయల నోట్లు మార్చుకోవచ్చు అన్న ఆర్బీఐ. 2000 రూపాయల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ.