తెలంగాణలో ‘జెనిసిస్‌ బయాలజిక్స్’ విస్తరణ

-

తెలంగాణలో తమ సంస్థ విస్తరణకు ముందుకొస్తోంది జెనిసిస్ బయాలజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. మధుమేహుల కోసం ఇన్సులిన్‌ ఉత్పత్తి చేసే ‘జెనిసిస్‌ బయాలజిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ విస్తరణ ప్రణాళికలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. ఇప్పటికే జీనోమ్‌ వ్యాలీలో 50 మిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టిన ఆ సంస్థ మరో 50 నుంచి 60 మిలియన్‌ డాలర్ల అదనపు పెట్టుబడితో ‘రీ కాంబినెంట్‌ బల్క్‌ మాన్యుఫాక్చరింగ్‌’ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.

ఈ నిర్ణయంతో ఇన్సులిన్‌ ధరలు అందుబాటులోకి వస్తాయని  మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణలో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ను ఏర్పాటు చేయనున్నట్లు ‘జాప్‌ కామ్‌ గ్రూప్‌’ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ ఆధారిత ఉత్పత్తుల తయారీలో పేరొందిన ఈ సంస్థ హైదరాబాద్‌లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దీనిద్వారా 1000 మందికి ఉద్యోగావకాశాలు లభించబోతున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version