మంత్రి వెలంపల్లి శ్రీనివాస్. రాష్ట్రంలో కొణిజేటి రోశయ్య తర్వాత వైశ్య సామాజిక వర్గానికి చెందిననాయకుడిగా పదవులు అందుకున్న నాయకుడు ఈయనే. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గత ఏడాది ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున విజయం సాదించిన వెలంపల్లి.. అనూహ్యంగా జగన్ కేబినెట్‌లో చోటు సంపాయించుకున్నారు. వాస్తవానికి ఏం దూకుడు ప్రదర్శిస్తాడు..? ఆయనకు పదవి ఇచ్చి జగన్ తప్పుచేశారు? అని చాలా వైఎస్సార్ సీపీ నాయకులు ఎద్దేవా చేశారు. నిజానికి వైశ్య సామాజిక వర్గానికి పదవులు దక్కడం అంటేనే అరుదు. అప్పట్లో టీజీ వెంకటేష్ ఒకసారి టీడీపీ హయాంలోను, కాంగ్రెస్ హయాంలోనూ మంత్రి పదవులు వెలగబెట్టినా.. ఆశించిన మేరకు గుర్తింపు తెచ్చుకోలేదు.
దీంతో అదే ముద్ర వెలంపల్లిపైనా ఉంటుందని ప్రతిపక్షం టీడీపీ కూడా భావించింది. పైగా కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఉన్న విజయవాడలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెలంపల్లి ఏం చక్రం తిప్పుతాడు అనుకున్నారు. కానీ, అందరి అంచనాలను పఠాపంచలు చేస్తూ.. వెలంపల్లి వెలిగిపోతున్నారు. ఇది వాస్తవం. కొన్ని నెలల కిందట ఆయన కనుసన్నల్లో దేవాదాయ భూముల కుంభకోణం జరిగిందంటూ..ఎల్లో మీడియా వార్తరాస్తే.. వెంటనే దానిపై విచారణకు ఆదేశించి.. తన నిజాయితీని నిరూపించుకున్నారు. దీంతో ఎల్లో మీడియాకు ఎక్కడా ఆయనపై వార్తలు రాసే అవకాశం లభించలేదు. ఇక, నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
మార్నింగ్ వాక్‌తోనే తన పని ప్రారంభమవుతుందనిఆయన పదేపదే చెప్పేవారు. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకునేందుకు ఎల్లో మీడియానిఘా పెట్టింది. ఇది నిజమని తెలిసి ముక్కున వేలేసుకుంది. కానీ, ఆయన దూకుడును ఏదో విధంగా అడ్డుకోవాలనే ఎల్లో కుట్రలను మాత్రం ఆపలేదు. దీనికి ప్రధాన కారణం.. టీడీపీలో ఉన్న కీలక నేతలను ఆయన ఆకర్షించి అధికార పార్టీలో చేర్చుతున్నారు. అదే సమయంలో విజయవాడలోనూ తన హవాను పెంచుకుంటున్నారు. దీంతో వెలంపల్లి చూసి చూసి ఓవార్తను అచ్చోసింది. ఆయన తన పుట్టిన రోజును పురస్కరించుకుని పెద్ద ఎత్తున వసూళ్లకుపాల్పడుతున్నాడంటూ వార్తను రాసేసింది.
మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పుట్టినరోజు పేరుతో ఆయన అనుచరుల వసూళ్ల దందాకు వన్‌టౌన్‌లోని పలువురు వ్యాపారులు కన్నీరు పెడుతున్నారు. చిన్న వ్యాపారులను సైతం విజయవాడలో వివిధ రకాల వ్యాపారులకు పెట్టింది పేరు. వస్త్రలత, కృష్ణవేణి క్లాత్ మార్కెట్ వంటి హోల్‌సేల్ వస్త్రవ్యాపారాలు మొదలు అన్ని రకాల టోకు వ్యాపారాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడున్న వ్యాపారులతో పాటు గొల్లపూడిలోని గాంధీ హోల్‌సేల్ మార్కెట్, దక్షిణ భారతంలోనే అతిపెద్దదైన భవానీపురం ఐరన్ యార్డులోని వ్యాపారుల నుంచీ మంత్రి అనుచరులు టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు చేశారు. అని కన్నీరుకార్చింది.
కానీ, ఈవార్తలోనే.. ‘కరోనా కారణంగా ఈ ఏడాది నా జన్మదిన వేడుకల పేరిట ఆడంబరాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయండి..’ అంటూ మంత్రి వెలంపల్లి ఓ ప్రకటన విడుదల చేశారని రాసింది. అదే సమయంలో నిజానికి పుట్టినరోజైన శనివారం మంత్రి వెలంపల్లి నగరంలో ఉండడం లేదు. అనికూడా పేర్కొంది. మరి ఊళ్లోనే ఉండని నాయకుడు.. పుట్టిన రోజు కోసం దందాలు చేయడమేంటో.. ఎల్లో మీడియాకే తెలియాలి. పైగా ఆయనేమీ డబ్బులేని నాయకుడు కాదు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచే వ్యాపారాలు ఉన్నాయి. పైగా కుటుంబపరంగా వచ్చిన ఆస్తులకు కూడా కొదవలేదు. లేనిదల్లా వివాదమే.. కానిదల్లా అవినీతిలేక పోవడమే. అయినా ఎల్లో మీడియా మాత్రం విషం కక్కేసింది.