అసలు దావూద్ ఇబ్రహీం ఎవరో తెలీదు అన్నట్టు నాటకాలు ఆడిన పాక్ బుద్ధి ఈరోజు బయట పడింది. దావుద్ ఇబ్రహీం పేరును టెర్రరిస్టుల జాబితాలో పేర్కొంటూ తాజాగా పాకిస్థాన్ ఒక లిస్టు విడుదల చేసింది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాదులని ఈ లిస్ట్ లో చేర్చింది.
మొత్తం 88 మంది ఈ లిస్టులో ఉన్నారు. వీరి ఆస్తులు ఇప్పటికిప్పుడు జప్తు చేసి వీరి బ్యాక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ లిస్ట్ విడుదల చేయడం ద్వారా దావూద్ ఎవరో తమకు తెలీదని చెబుతూ వచ్చిన పాక్ ఇప్పుడు నిజం ఒప్పుకున్నట్టు అయింది. అలానే దావూద్ కరోనాతో మరణించాడు అని ఆ మధ్య జరిగిన ప్రచారం కూడా అంతా బూటకం అని తేలింది. ఇక వీరందరి పేర్లను ఎందుకు బయట పెట్టింది అనే విషయం తెలియాల్సి ఉంది.