Young woman seriously injured in love attack: గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రేమోన్మాది దాడిలో ఓ యువతి గాయపడింది. ఈ సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఈసంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన కావ్యకి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కావ్య పరిస్థితి బాగానే ఉందని చెబుతున్నారు వైద్యులు.
హాస్టల్ లో ఉన్న కావ్యను మాట్లాడాలి అని కిందకి పిలిచి బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది క్రాంతి. ఇంటర్ నుంచి కావ్య తో క్రాంతికి పరిచయం ఉందని చెబుతున్నారు ఏపీ పోలీసులు. ప్రేమ నిరకరించటమే కావ్య పై క్రాంతి దాడికి కారణంగా గుర్తించిన పోలీసులు… దాడికి పాల్పడిన క్రాంతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన విచారణ చేస్తున్నారు ఏపీ పోలీసులు.