సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి పాలనచేస్తే.. ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు! ప్రస్తుతం జగన్ ఆ దిశగానే ఆలోచించి పాలనచేస్తున్నట్లుగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వాటికి బలం చేకూరుస్తూనే జగన్ తన పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరిగే దిశగా ఆలోచిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా తీసుకున్న మరో నిర్ణయం… కొత్తగా 11 చోట్ల ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్ ల్యాండింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం! రాష్ట్రంలో మత్స్యకారుల వలసలను నివారించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పడుతుందనడంలో సందేహం లేదు!
జగన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయాన్ని విజయసాయి రెడ్డి ప్రకటించారు. జగన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో మత్యకారులు ఎక్కువగా నివసించే 11 ప్రాంతాల్లో భారీ మార్పులు రాబోతున్నాయన్న విజయసాయిరెడ్డి… గత సీఎం చంద్రబాబు.. మత్స్యకారుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంభించారని, సముద్రంలో చేపల వేటకు అవసరమైన కనీస మౌలిక వసతుల కల్పన కూడా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శలవర్షం కురిపించారు. ప్రతి ఏటా ఏపీ నుంచి 25వేల మందికిపైగా మత్స్యకారులు జీవనోపాధి కోసం వందల మైళ్ళ దూరంలో ఉన్న గుజరాత్ తీరానికి వలసవలస పోతుంటారు.. అయితే ఈ జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆ అవసరం ఇక ఉండదు అనే చెప్పాలి!
తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, శ్రీకాకుళం జిల్లా బడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లా పూడిమడక, కృష్ణాజిల్లా మచిలీపట్నం, గుంటూరుజిల్లా నిజాంపట్నం, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వలదిన్న లలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు కానుండగా… శ్రీకాకుళం జిల్లాలో మంచినీళ్లపేటలో ఫిష్ ల్యాండ్ నిర్మాణం జరగనుంది. వీటికి సంబందించి మొత్తం రూ.3500 కోట్లతో నిర్మాణాలు, వసతులను ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేపట్టనుంది.