దాదాపు రెండు నెలల క్రితం కేబినేట్ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణా సిఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఏ సమయంలో ఏ సమస్య గురించి మాట్లాడాలి అనేది వారికి కనీస అవగాహన లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్య ప్రస్తుతం దాదాపుగా నిజమే అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
అవును ఇప్పుడు అనవసరంగా కేటిఆర్ ని కాంగ్రెస్ టార్గెట్ చేసింది అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆయనను చాలా తక్కువ అంచనా వేసింది అని అంటున్నారు. ఆయన మీద చేసిన ఆరోపణలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆయన కూడా చట్టపరంగా దానిని ఎదుర్కొంటా అంటూ ఒక సవాల్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గనుక ఆ ఆరోపణలు నిజం కాకపోతే మాత్రం…
కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడటం అనేది దాదాపుగా ఖాయం అని పరిశీలకులు అంటున్నారు. సాధారణంగా అవినీతి విషయంలో కేంద్రం తెలంగాణా సర్కార్ ని టార్గెట్ చేసింది. కాని ఇప్పటి వరకు రూపాయి కూడా వాళ్లకు దొరకలేదు. బిజెపి ఆరోపణలు చేసినా సరే వాటికి పెద్దగా పట్టు కూడా రాలేదు అనే చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ఆరోపణలను కూడా ప్రజలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి కనపడటం లేదు.