విశాఖలో రూ.3వేల కోట్ల విలువైన భూమిని ఊరు పేరు లేని కంపెనీకి కూటమి సర్కార్ రూపాయికే కట్టబెట్టిందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. లులు గ్రూపునుకు రూ.2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారని.. రాజధానిలో నిర్మాణ పనుల అంచనాలను విపరీతంగా పెంచి భారీ దోపిడీకి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. పీఏసీ సమావేశంలో పాల్గొన్న జగన్.. ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రూ.36 వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు.
గతంలో తాము చేసినట్టుగా ఎందుకు బటన్‌లు నొక్కలేదని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ ప్రశ్నించారు. బటన్‌లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదని.. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తోందని. అందుకే ఆయన బటన్‌లు నొక్కడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. టఏదైనా ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిందంటే, వెంటనే చంద్రబాబునాయుడు డైవర్ట్ చేస్తున్నారు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేయిస్తున్నారు.ట అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.