ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సౌదీలో అరుదైన స్వాగతం లభించింది. ఎన్నడూ లేని విధంగా ఆ దేశం మోదీని ప్రత్యేకంగా స్వాగతించింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించగానే.. రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-15 విమానాలు దాన్ని అనుసరించి గౌరవంగా స్వాగతం పలికాయి. దీనికి సంబంధించిన వీడియోను విదేశాంగ శాఖ షేర్ చేసింది.
ఇండియా – సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతం అయ్యే దిశగా ముందడుగు పడుతుందని ఈ ఆత్మీయ స్వాగతం చాటుతోందని. ఇక రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ మోదీ సౌదీ వెళ్లారు. ఇంధనం, వాణిజ్యం, రక్షణ వంటి పలు కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగనున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్, సౌదీ అరేబియాల మధ్య ఇప్పటికే బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్న విషయం తెలిసిందే.
🇮🇳-🇸🇦 friendship flying high!
As a special gesture for the State Visit of PM @narendramodi, his aircraft was escorted by the Royal Saudi Air Force as it entered the Saudi airspace. pic.twitter.com/ad8F9XGmDL
— Randhir Jaiswal (@MEAIndia) April 22, 2025