నీ రౌడీలకు టిడిపి భయపడదు, వెనక్కి తగ్గదని నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. పుట్టపర్తి ఉద్రిక్తతలపై నారా లోకేష్ స్పందించారు. ఉన్నమాట అంటే ఉలుకెందుకు పుట్టపర్తి ఎమ్మెల్యే దోపిడికుంట శ్రీధర్ రెడ్డి గారూ! దొంగలని దొంగా అన్నామని పుట్టపర్తిలో టిడిపి శ్రేణులు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి పై దాడులకి దిగారు వైసిపి గూండాలు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే దోపిడీకుంట శ్రీధర్ రెడ్డి అవినీతి చేశారని పల్లె రఘునాథరెడ్డి ప్రమాణం చేశారు. నీతిమంతుడైతే వైసిపి ఎమ్మెల్యే ప్రమాణం చేయొచ్చు! పోలీసుల్ని ప్రయోగించి, వైసిపి గూండాలతో దాడులకి పాల్పడ్డారంటే అవినీతి చేశామని ఒప్పుకున్నట్టే. నీ రౌడీలకి టిడిపి భయపడదు, వెనక్కి తగ్గదని హెచ్చరించారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నియోజకవర్గంలో తిరుగుతున్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉద్యోగులకు నిజాయితీగా ఉండాలంటూ నీతులు చెబుతారు. అయితే తాను మాత్రం గుట్టలను దోచేస్తాడు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారు. 902, 909 సర్వే నెంబర్లలోని 20 ఎకరాలను అక్రమించాడు. ఇది మరో రుషికొండ అని, ఎమ్మెల్యే గారి విలాస కార్యక్రమాలకు అడ్డా అని లోకల్ టాక్ అన్నారు.