ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ఉన్న నందమూరి లక్ష్మీపార్వతి కి… కీలక పదవులు అప్పగించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. వైసిపి పార్టీని చాలామంది కీలక నేతలు వీడుతున్న నేపథ్యంలో…. జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా… కీలక పదవి నందమూరి లక్ష్మీపార్వతి చెప్పగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
దీంతో ఆమె సోమవారం నుంచి ఆ బాధ్యతలను చేపట్టబోతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు…. ప్రభుత్వానికి సంబంధించిన ఒక పదవి అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు కూటమి వచ్చిన తర్వాత ఆమె ఆ పదవికి రాజీనామా చేసి ఖాళీ గానే ఉంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో నందమూరి లక్ష్మీపార్వతి కి.. వైసిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి కట్టబెట్టారు.