వివేకా హత్య కేసులో సాక్షిగా వైఎస్‌ షర్మిల

-

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను సీబీఐ సాక్షిగా పేర్కొంది. షర్మిలను 259వ సాక్షిగా పేర్కొంటూ సీబీఐ కోర్టుకు దర్యాప్తు సంస్థ వాంగ్మూలం సమర్పించింది. గతేడాది అక్టోబర్‌ 7న దిల్లీలో షర్మిల సీబీఐకి వాంగ్మూలమిచ్చారు.

తన వద్ద ఆధారాల్లేవు కానీ.. రాజకీయ కారణాలతోనే ఈ హత్య జరిగిందని షర్మిల వాంగ్మూలంలో పేర్కొన్నారు. హత్యకు కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు కారణాలు కాదని.. మపో పెద్ద కారణం ఉందని తెలిపారు. అవినాష్‌ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే కారణం కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకోవచ్చని చెప్పారు.

‘‘హత్యకు కొన్ని నెలల ముందు బెంగళూరులోని మా ఇంటికి వివేకా వచ్చారు. కడప ఎంపీగా పోటీ చేయాలని ఆయన నన్ను అడిగారు. ఎంపీగా అవినాష్‌ పోటీ చేయొద్దని కోరుకుంటున్నట్లు చెప్పారు. అతడికి టికెట్‌ ఇవ్వకుండా ఎలాగైనా జగన్‌ను ఒప్పిద్దామన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా తాను వెళ్లనని వివేకా ఆలోచించారు. కచ్చితంగా ఒప్పించగలననే ధీమాతో ఆయన మాట్లాడారు. జగన్‌ నాకు మద్దతివ్వరని తెలుసు కాబట్టి ఎంపీగా పోటీకి మొదట ఒప్పుకోలేదు. బాబాయ్‌ పదేపదే ఒత్తిడి చేయడంతో సరే అన్నాను’’ అని షర్మిల తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version