పుట్టింటికి వచ్చిన ఈ ఆడబిడ్డను గెలిపించుకోండి – వైస్ షర్మిల

-

ys sharmila emtional post: పుట్టింటికి వచ్చిన ఈ ఆడబిడ్డను గెలిపించుకోండి అని వైస్ షర్మిల పోస్ట్ పెట్టారు. రాజశేఖర్ బిడ్డ ఈరోజు కడప ఎంపీ స్థానానికి పోటీ చేయడం జరుగుతుంది. కడప గడ్డ మీద న్యాయానికి, నేరానికీ జరుగుతున్న ఈ పోరాటంలో న్యాయం వైపు నిలబడతారని నమ్ముతున్నాను. పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డను ఎలాగైతే ప్రేమగా చూసుకుంటారో.. అలాగే నన్ను కూడా మీ ఇంటి ఆడబిడ్డగా అక్కున చేర్చుకుంటారని ఆశిస్తున్నాను అని వెల్లడించారు.

ys sharmila emtional post

అందుకే మే 13వ తేదీన జరిగే పోలింగ్‌లో ఎంపీ బ్యాలెట్ నమూనాలోని వరుస సంఖ్య ‘4’ మీద ‘హస్తం’ గుర్తు బటన్ నొక్కి రాజశేఖర్ బిడ్డను ఆశీర్వదిస్తారని కొంగుచాచి అడుగుతున్నాను అని చెప్పారు.మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర్‌ రెడ్డి గారి నుంచి మీకు ఎందుకు రాలేదు జగనన్న?? ఏదైనా ఒక లావాదేవీ కోసం, లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు ఆయన. అలాంటి వ్యక్తి బిడ్డని నేను. ఆయన హృదయానికి దగ్గరగా, ఆయన మాటలు వింటూ హృదయంలో హృదయంలా పెరిగాను. ఆయన ఆశయాల కోసం ఆ రకంగానే మీకు సహాయపడాలని నేను నిస్వార్థంగా త్యాగం చేశాను. మీ గెలుపు కోసం పని చేశాను అంటూ ఎమోషన్ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version