YSRCP అభ్యర్థి తరఫున ప్రచారం చేయనున్న అల్లు అర్జున్?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలకు రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరేత్తిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వైసీపీ పార్టీ కోసం ప్రచారం చేసేందుకు రంగంలోకి దిగాడు అల్లు అర్జున్. ఐకాన్ అల్లుఅర్జున్ ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు సమాచారం అందుతుంది.

Allu Arjun’s Support to Nandyala YSRCP Candidate

నంద్యాల నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి తరఫున సతీమణి అల్లు స్నేహారెడ్డి తో కలిసి బన్నీ ప్రచారం చేస్తారని సమాచారం అందుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ అయినా కిషోర్ రెడ్డికి సపోర్ట్ గా 2019 సంవత్సరంలోను విశేష్ తెలిపారు. ఇక ఈసారి కూడా వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డికి సపోర్ట్ గా బన్నీ ప్రచారం చేస్తారని ప్రచారం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version