3 నామాల వానికి ప్రధాని మోడీ పంగనామాలు పెట్టాడు – వైస్ షర్మిల

-

3 నామాల వానికి ప్రధాని మోడీ పంగనామాలు పెట్టాడని ఫైర్ అయ్యారు వైస్ షర్మిల. తిరుపతిలో జరిగిన భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన అశేష ప్రజానీకానికి, కార్యకర్తలకు,నాయకులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు షర్మిల. ఇదే తిరుపతి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అనేక హామీలిచ్చి మోసం చేశారు.మోసం అంటే మోదీ, మోదీ అంటే మోసం అంటూ నిప్పులు చెరిగారు.

ఏపీలో అద్భుతమైన రాజధాని కడతామన్నారు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని హార్డ్‌వేర్ హబ్‌ చేస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం కట్టిస్తామన్నారు కానీ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నిలబెట్టుకున్నారా? రామభక్తుడ్ని అని చెప్పుకునే మోదీ మూడు నామాల వానికి పంగనామాలు పెట్టాడు. పుణ్యక్షేత్రంలో నిలబడి మాట తప్పాడని మణిపడ్డారు .

దేవుడ్ని కూడా మోసం చేసిన మిమ్మల్ని ఏమనాలి? మోదీని కేడీ అనక ఇంకేమనాలి? రాష్ట్ర హక్కుల సాధనలో బాబు,జగన్ ఇద్దరు విఫలమయ్యారు. ఒక్క హక్కు మీద కూడా పోరాటం చేయలేదు. చంద్రబాబు అయితే ఊసరవెల్లి లా రంగులు మార్చారు. జగనన్న అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పులిలా గర్జించి అధికారం రాగానే పిల్లిలా అయ్యాడు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే హోదాపై రాహుల్ గాంధీ గారు తొలిసంతకం చేస్తారు. ప్రజలందరూ ఆలోచించాలి ప్రత్యేక హోదా కోం పోరాడే వాళ్లు కావాలా..? తాకట్టు పెట్టే వాళ్లు కావాలో నిర్ణయించుకోవాలన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version