ఈడీ, సీబీఐ, ఎస్బీఐలను సొంత భటులుగా బీజేపీ వినియోగిస్తోందని వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. మన ముందున్న సవాలు బిజెపి, ఆర్ఎస్ఎస్ కాదన్నారు. మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టి, విద్వేషాలు పెంచి లాభం పొందాలని చూస్తున్నారు…మతం పేరిట చిచ్చుపెట్టి ఆ మంటలో చలి కాచుకోవడం బిజెపి విధానం అంటూ ఫైర్ అయ్యారు.
గోద్రా, మణిపూర్ బిజెపి మత విధానాలకు ఉదాహరణలు అన్నారు. ఈడీ, సీబీఐ, ఎస్బీఐ లను బిజెపి సొంత భటులుగా వినియోగిస్తోంది…హిజాబ్, పుల్వామా, రామమందిరం అంటూ ఎన్నికలొచ్చిన ప్రతీసారి ఒక అంశం తెస్తారని మండిపడ్డారు. అందరూ కలిసి పోరాటం చేయాలి… కాంగ్రెస్ తరఫున మాటిస్తున్నా..బిజెపి తో ప్రత్యక్ష పొత్తులో ఉన్న చంద్రబాబు, పరోక్ష పొత్తులో ఉన్న జగనన్న లకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు వైఎస్ షర్మిల. బిజెపి నీతి లేని పాలనలో విలువలు దారుణంగా దిగజారిపోతున్నాయన్నారు.