జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాస్ !!

-

ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ విసిరిన చేనేత ఛాలెంజ్ ను వైసీపీ నేత బాలినేని స్వీకరించారు. చేనేత వస్త్రాలతో రూపొందించిన చొక్కా ధరించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు బాలినేని. ట్విటర్ వేదికగా చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత దుస్తులు ధరించి ఫొటోలు దిగాలంటూ పవన్ కళ్యాణ్ చేసిన చేనేత సవాల్ ను స్వీకరించానని వెల్లడించారు వైసీపీ సీనియర్ నేత బాలినేని.

నేను చిత్తశుద్ధితో చేనేత మంత్రిగా వైఎస్ ప్రభుత్వంలో పని చేశానని.. ఆనాడు వైఎస్సార్ రూ. 300 కోట్లు చేనేతల కోసం రుణమాఫీ చేశారని వెల్లడించారు. ఇవాళ మా నాయకుడు జగన్ ప్రభుత్వంలోనూ నేతన్నల సంక్షేమం కోసం వైఎస్సార్ నేస్తం దగ్గర నుంచి ఎన్నో పథకాలు అందిస్తున్నామని వివరించారు.

అప్పుడైనా, ఇప్పుడైనా చేనేతల సంక్షేమంకోసం, వారి అభివృద్ధికోసం నిజాయితీతో పని చేస్తున్నామన్నారు. అందరూ చేనేత వస్త్రాలు ధరించండని పిలుపునిచ్చారు. అయితే.. పవన్‌ కళ్యాణ్‌ ఛాలెంజ్‌ విసరగానే వైసీపీ సీనియర్ నేత బాలినేని.. స్వీకరించడంతో.. ఏపీ రాజకీయాలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. జనసేన పార్టీలోకి బాలినేని వెళుతాడంటూ ప్రచారం మొదలైంది. కాగా.. మంత్రి వర్గ విస్తరణ తర్వాత వైసీపీపై బాలినేని అసంతృప్తిలో ఉన్నట్లు సమచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version