ఇక అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు – వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు

-

ఇక అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని వైసీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వివేకా కేసులో అవినాష్ రెడ్డి పాత్ర పై స్పందించిన రాజమల్లు ప్రసాద్ రెడ్డి.. అవినాష్ రెడ్డిని అనవసరంగా కేసులో ఇరికించారని తెలిపారు. ఇక అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు…అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే బైలుపైన బయటకు వస్తాడన్నారు.

చంద్రబాబు వెనక్కుండి ఈ కేసులో కుట్ర చేసి అవినాష్ ను కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేశాడని.. ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి హింసను ప్రేరేపించడని మన సాక్షిగా నమ్ముతున్నానన్నారు. మొదటి నుంచి నేను ఇదే చెబుతున్నా.. నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని వెల్లడించారు. అవినాష్ రెడ్డి హత్య చేశాడని రుజువు ఐతే ఇక ఈ రాజకీయాల్లో ఉండనని, నాతో తొమ్మిది మంది రాజీనామా చేయమని చెప్పానని.. ముద్దైని చేస్తే రాజీనామా చేస్తామని చెప్పలేదన్నారు. న్యాయ స్థానంలో రుజువు ఐతే రాజీనామా చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానని ప్రకటన చేశారు వైసీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version