కుత్బుల్లాపూర్‌పై శంభీపూర్ పట్టు..ప్రజల మద్ధతుతో సీటు.!

-

Shambhipur: తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీలో సీట్ల కోసం తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చిన వారికి, మొదట నుంచి బి‌ఆర్‌ఎస్ పార్టీలో ఉంటున్న వారి మధ్య ఫైట్ నడుస్తుంది. ఇదే క్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా బి‌ఆర్‌ఎస్ పార్టీలో పోటీ నెలకొంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కే‌పి వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుల మధ్య సీటు కోసం పోటీ నెలకొంది.

Shambhipur

వివేకా 2014లో టి‌డి‌పి నుంచి గెలిచి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. 2018లో బి‌ఆర్‌ఎస్ సీటు ఆయనకే దక్కింది. అలాగే ఆయన ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచారు. అయితే బి‌ఆర్‌ఎస్ పార్టీలో శంభీపూర్ మొదట నుంచి పనిచేస్తున్నారు. పార్టీ ఆవిర్భవించిన 2001లోనే శంభీపూర్ బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. అయితే శంభీపూర్ అసలు పేరు సుంకరి రాజు..అయితే తన వూరు పేరుని తన పేరుగా మార్చుకుని శంభీపూర్ రాజు అయ్యారు. ఇక మొదటసారి కుత్బుల్లాపూర్ లో గులాబీ జెండా ఎగరవేశారు. మొదటలో శంభీపూర్ మండల కోశాధికారిగా పనిచేశారు.

అలాగే బీసీ సెల్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రంగారెడ్డి జిల్లా బి‌ఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడుగా, అలా పదవులు చేపడుతూ..కుత్బుల్లాపూర్ ఇంచార్జ్ కూడా పనిచేశారు.  ప్రజల్లోనే ఉంటూ..పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. అయితే 2014లో టి‌డి‌పి నుంచి గెలిచి వివేకా బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. దీంతో ఆయనకు సీటు దక్కడం కష్టమైంది. 2018లో కూడా దక్కలేదు.

అయినా సరే శంభీపూర్ వెనక్కి తగ్గకుండా పనిచేస్తూ చిన్న వయసులోనే ఎమ్మెల్సీ పదవి సాధించారు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన ప్రజలకు మరింత సేవ చేస్తూ ముందుకెళుతున్నారు.  అవసరమైతే సొంత సబ్బులు సైతం ఖర్చు పెట్టి ప్రజలకు అండగా ఉండటానికి వెనుకాడరు.

అటు కార్పొరేటర్ల మద్ధతు కూడగట్టుకున్నారు..కార్యకర్తలకు అండగా ఉంటున్నారు..ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందున్నరు. ఇలా ప్రజా మద్ధతు పెంచుకున్న శంభీపూర్..నెక్స్ట్ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక ఈయన..కే‌టి‌ఆర్‌ సన్నిహితుడు అనే విషయం తెలిసిందే. ఇటు ప్రజా మద్ధతు, అటు అధిష్టానం సపోర్ట్ కూడా ఉన్న శంభీపూర్ రాజుకు కుత్బుల్లాపూర్ సీటు దక్కే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి..ఇక గెలుపు గురించి చెప్పాల్సిన పని లేదు. చూడాలి మరి శంభీపూర్ రాజుకు ఈ సారి లక్ ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version