అమరావతి: ఏపీలో ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. అగ్గి అంటించకుండానే భగ్గుమంటున్నాయి. ప్రతి రోజు మాదిరే పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఈ రోజు పెట్రోల్‌పై లీటర్‌కు 35 పైసలు, డీజిల్ లీటర్‌పై 37 పైసలు పెరిగింది.
పెరిగిన ధరతో కలిపి గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.31 కాగా డీజిల్ లీటర్ ధర రూ. 98.38కి విక్రయాలు జరుగుతున్నాయి. ఇక విజయవాడలో పెట్రోల్ లీటర్ ధర రూ. 104.11గా ఉంది. డిజిల్ లీటర్ ధర రూ. 98.18గా ఉంది. ఇక ప్రీమియం పెట్రోల్ ధర అయితే గుంటూరు లీటర్ పెట్రోల్ రూ. 107.77 ఉంది. విజయవాడలో ప్రీమియం పెట్రోల్ లీటర్ ధర రూ. 107.57గా అమ్ముతున్నారు.
తెలంగాణలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్ పై 38 పైసలు పెరిగాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.96కాగా డీజిల్ ధర రూ. 96.63గా ఉంది.
పెరిగిన ధరలతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభావం నిత్యావసరాలపై పడిందని ఆవేదన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ధరల పెరుగుదలను నియంత్రించాలని కోరుతున్నారు. ఇన్ని రోజులు లాక్ డౌన్ వల్ల పనులు లేవని, ఇప్పుడు కాస్త కోలుకుంటున్న సమయంలో తమపై ఈ బాదుడు ఏందని ప్రశ్నిస్తున్నారు.