త్వరలో మరోసారి నామినెటెడ్ పదవుల పందేరం..ఈసారి ప్రాధాన్యత ఎవరికంటే..?

-

మరోసారి నామినెటెడ్ పదవుల పందేరానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు దఫాలు పోస్టులను భర్తీ చేసిన సర్కార్.. మరో్సారి కీలక పోస్టుల భర్తీ కోసం సీరియస్ గా దృష్టి పెట్టింది.. సీనియర్లకు, యువకులకు కార్పొరేషన్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. తొలి జాబితాలో 21 మంది, సెకండ్‌ లిస్ట్‌లో 59 మందితో నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేశారు. ఈ రెండు జాబితాల్లో సీనియర్లకు, టిక్కెట్లు త్యాగం చేసినవారితోపాటు.. వైసీపీ హయాంలో టీడీపీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వలేదనే ప్రచారం టీడీపీలో జరిగింది. దీంతో ఈసారి చంద్రబాబునాయుడు అసంతృప్తులను చల్లార్చేలా నిర్ణయం తీసుకోబోతున్నారట.. ఇటీవల సీఎం, డిప్యూటీ సీఎంలు బేటీ అయినప్పుడు కూడా పోస్టుల గురించి చర్చ జరిగిందని పార్టీవర్గాలు చెబుతున్నాయి..

గత ఎన్నికల్లో చంద్రబాబు సూచనల మేరకు పోటీకి దూరంగా ఉన్న కీలక నేతలకు ఈసారి పదవులు వస్తాయని టాక్ వినిపిస్తోంది.. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న, నాగుల్ మీరా స‌హా..దేవినేని ఉమా వంటినేతలకు ఇప్పటి వరకు పదవులు దక్కలేదు.. దీంతో వారు అసంతృప్తిలో ఉన్నారు.. వారికి ప్రాధాన్యత ఉండే పోస్టులు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారట..

అనంతరపురానికి చెందిన యామిని బాల కుటుంబంతోపాటు.. మాజీ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ కోసం టిక్కెట్ త్యాగం చేసిన వర్మ కూడా నా సంగతేంటి అంటున్నారు.. వీరిందరి విజ్ణప్తులు, చేసిన త్యాగాలను పరిగణలోకి తీసుకుని.. నామినెటెడ్ పదవుల జాబితాను చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ సిద్దం చేస్తున్నారట.. వీరితో పాటు.. యువకులకు కూడా కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మేన్ పోస్టులు ఇస్తే.. పార్టీకి ఊపు వస్తుందని టీడీపీ భావిస్తోంది.. మరో రెండు వారాల్లో పదవులను భర్తీ చెయ్యబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version