తెలంగాణ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున పలు జిల్లాల్లో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ములుగు జిల్లా కేంద్రంగా భూమి కంపించింది. ములుగు, వరంగల్, ఖమ్మం, భద్రాచలంతో పాటు హైదరాబాద్‌లోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేలు పై దాని తీవ్రత 5.3గా నమోదైంది. అయితే, ఉదయాన్ని మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయం వద్ద అయ్యగారు పూజలు చేస్తున్న టైంలో భూమి కంపించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ఉదయం 7.27 నిమిషాలకు 5.3తీవ్రతతో మేడారం వణికింది. ఆ భయానక దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. భూమి కంపించిన సమయంలో పూజారి, అక్కడే ఉన్న ఓ మహిళ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. షాక్‌లో చూస్తూ ఉండిపోయారు. కాగా, ఈ భూకంపం వలన ఎటువంటి ప్రమాదం లేదని ఎన్జీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు.
ఉదయం 7.27 నిమిషాలకు.. 5.3 తీవ్రతతో వణికిన మేడారం pic.twitter.com/hkFuxfLr6N
— greatandhra (@greatandhranews) December 4, 2024