జానీ మాస్టర్ చాలా మంచివాడు – అనీ మాస్టర్

-

Anee Master Comments On Jani Master Case : జానీ మాస్టర్ చాలా మంచివాడు అని తెలిపారు అనీ మాస్టర్. జానీ మాస్టర్ కేసు విషయం విని షాక్ అయ్యాను.. వారంపాటు ఏం తోచని స్థితిలో ఉన్నానని తెలిపారు. అన్నీ తెలుసుకున్న తర్వాతే మీడియా ముందు మాట్లాడదాం అని ఈరోజు ముందుకు వచ్చానని వివరించారు. జానీ మాస్టర్ కి వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి తీసుకోవడం బాధాకరమన్నారు.

జానీ మాస్టర్ చాలా మంచివాడు – అనీ మాస్టర్

నేరం రుజువు కాకముందే అవార్డు కమిటీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదు.. కనీసం హోల్డ్ లో పెట్టాల్సిందని చురకలు అంటించారు. జానీ మాస్టర్ దగ్గర నేను రెండేళ్లు వర్క్ చేశాను. ఇతర దేశాలు కూడా వెళ్ళాము.. మంచి వ్యక్తి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జానీ మాస్టర్ మంచివాడు.. గొప్ప వ్యక్తి అని మీడియా ముందు చెప్పిన అమ్మాయి.. కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version