ఆయుష్మాన్ ఖురానా ‘అనేక్’..OTT స్ట్రీమింగ్ టైమ్ ఫిక్స్..

-

బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా నటించిన చిత్రం ‘అనేక్’ ఇటీవల విడుదలైంది. అయితే, ఈ సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో డైరెక్టర్..ఈశాన్య రాష్ట్రాల సమస్యపైన చర్చించారు. ఆర్మీ ఆఫీసర్ గా ఆయుష్మాన్ ఖురానా నటించారు.

ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న వేర్పాటు వాద సమస్యలను పరిష్కరించేందుకు ఆఫీసర్ గా ఆయుష్మాన్ ఖురానా చక్కటి నటన కనబర్చారు. ‘‘తప్పడ్, ఆర్టికల్ 15, ముల్క్’’ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్స్ కు దర్శకత్వం వహించిన అనుభవ్ సిన్హా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా ‘ఆర్టికల్ 15 ’ ఫిల్మ్ చేశారు.

వీరి కాంబోలో వచ్చిన ‘అనేక్’ మాత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో రికార్డులు క్రియేట్ చేయలేకపోయింది. ఇందులో టాలీవుడ్ ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి నటించారు. తాజాగా ఈ సినిమా OTT స్ట్రీమింగ్ గురించి మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 26 నుంచి ‘అనేక్’ ఫిల్మ్ స్ట్రీమింగ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version