సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. గెలిచేది ఎవరంటే..?

-

2023 సంక్రాంతి పండుగ బరిలోకి దిగడానికి స్టార్ హీరోలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇక పోతే ఈ సంక్రాంతికి ఎవరెవరు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. ముఖ్యంగా మాస్ మెగా మూవీ సంక్రాంతి బరిలో పోటీ పడుతుంది అని సమాచారం .ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇక సంక్రాంతి బరిలోకి చిరంజీవితో పాటు ప్రభాస్ ఆది పురుష్ సినిమా, విజయ్ వారసుడు సినిమా కూడా సంక్రాంతికి విడుదల కాబోతున్న ట్లు సమాచారం. ఇక అంతే కాదు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న నాలుగవ చిత్రం కూడా సంక్రాంతికి విడుదల కాబోతున్న ట్లు సమాచారం. ఇక పోతే చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందె. ఇక ఇందులో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త భాగం వైరల్ గా మారుతుంది . అదేమిటంటే ఈ సినిమాకు సంబంధించి హిందీ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి అని సమాచారం. హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తున్న కారణంగా హిందీ మార్కెట్లో ఈ సినిమాకు సాలిడ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. 45 కోట్ల రూపాయల వరకు ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే మరొకవైపు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరొక సినిమా చిరంజీవి చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇకపోతే మలయాళంలో బ్రో డాడీ సినిమాలో తండ్రీకొడుకులుగా మోహన్ లాల్ , పృథ్వీరాజ్ సుకుమార్ పాత్రలను తెలుగులో చిరంజీవి, సాయి ధరమ్ తేజ్ కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే నిజమైతే అభిమానులకు మంచి మాస్ పండగే అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version