‘ఛలో విజయవాడ’కు అంగన్వాడీ కార్యకర్తలు పిలుపునిచ్చారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లేందుకే ఈ విధంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొంటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10వేల మంది అంగన్వాడీలు విజయవాడలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్దకు రానున్న నేపథ్యంలో సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ ఏర్పాట్లను పరిశీలించారు. భారీగా అక్కడ పోలీసులను మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలో చోటుచేసుకోకుండా ఉండేందుకు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.