ముందు కామెడీ తర్వాత రౌద్రం మరియు ఎమోషన్.!

-

బాలయ్య బాబు  108వ చిత్రంగా తెరకెక్కుతున్న అనిల్ రావిపూడి  డైరెక్షన్ లో జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.బాలయ్య చాలా ఎనర్జిటిక్,  ఎన్బీకే 108′ తొలి షెడ్యూల్ వి వెంకట్ మాస్టర్ యాక్షన్ తో ప్రారంభమైంది. ఇక త్వరలో సెకండ్ షెడ్యూల్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తోంది.సెకండ్ షెడ్యూల్ ను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ హైదరాబాల్ లోనూ ఉంటుందని టాక్.

ఇక ఈ షెడ్యూల్ లోనూ యాక్షన్ సన్నివేశాలనే చిత్రీకరించనున్నారని సమాచారం. అలాగే బాలయ్యతో పాటు సినిమాలోని నటీనటులు తోనూ ముఖ్య సన్నవేశాలను చిత్రీకించనున్నారు.బాలకృష్ణను అనిల్ రావిపూడి ఓ కొత్త లుక్‌ లో ప్రజెంట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కూడా రెండు పాత్రల తో నడుస్తుందని ముందే లీకులు అందాయి.

ఒక పాత్ర శ్రీ లీల తండ్రి కాగా మరో పాత్ర ను ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. ఆ పాత్ర యంగ్ లుక్ లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ పాత్రలు కూడా ఇంటర్వెల్ వరకు ఫుల్ గా కామెడీ సీన్స్ తో ఫుల్ గా ఎటర్టైన్మెంట్ ఉంటుందని అంటున్నారు. అలాగే ఇంటర్వెల్ తర్వాత బాలయ్య ఉగ్రరూపం చూపిస్తారట. అలాగే ఎమోషన్స్ కూడా పతాక స్తాయిలో ఉండి ప్రేక్షకులను అమితంగా అలరిస్తాయి అని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version