‘యానిమల్ మూవీ సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది: మాజీ ఐఏఎస్

-

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందని పలువురు సెలబ్రిటీలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో యానిమల్ సినిమాపై మాజీ ఐఏఎస్ వికాస్ దివ్యకృతి తీవ్ర విమర్శలు చేశారు. ‘ఈ చిత్రం మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది అని సంచలన ఆరోపణలు చేశారు. హీరోను జంతువులా చూపించారు. ఇందులో ఓ నటిని హీరో తన కాలి షూ నాకమనే సీన్ ఉంది. దీన్ని చూసి యువత ఇలానే ప్రవర్తిస్తే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఇలాంటి బుద్ధిలేని సినిమాలు తీయడం బాధ కలిగిస్తోంది’ అని ఆయన మండిపడ్డారు.

కాగా, బాబి డియో అనిల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.డిసెంబర్ ఒకటవ తేదీన విడుదలైన యానిమల్ చిత్రం 900 కోట్ల భారీ వసూళ్లను సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news