సమాజంలో మనుషులతో పాటు జంతువులు కూడా అవసరమేనని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జిహెచ్ఎంసిలో వీధి కుక్కల దాడుల ఘటనలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు సమీక్ష చేపట్టారు. ఈ సమీక్ష సమావేశానికి మునిసిపల్, వెటర్నరీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో జరిగిన ఘటన బాధాకరం అన్నారు.
నగరంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందన్న ఆయన.. మేయర్ చేసిన వ్యాఖ్యలను రాజకీయం చేస్తున్నానని మండిపడ్డారు. ఎవరో సలహాలు ఇస్తామంటే తీసుకోమని, ఈ సమస్యపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసని చెప్పారు. బాలుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కుక్కల విషయంలో 8 ప్రత్యేక టీమ్స్ తో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామన్నారు. ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని, ట్రైనింగ్ క్యాంపు పెట్టి వీటి కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.