బాలయ్య అభిమానులకి మరో సర్ప్రైజ్.. వీడియో అదుర్స్..!

-

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో కొత్త మూవీ (‘BB3’) తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అవబోతుంది. కాగా, ఈ చిత్రానికి “మోనార్క్” అనే ప‌వర్ ఫుల్ టైటిల్‌ ను అనుకుంటున్నట్టు సమాచారం. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ ను బాల‌కృష్ణ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆ రోజు విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించింది. బాలయ్య చెప్పే డైలాగ్, ఆయన పంచే కట్టు అభిమానులకి మంచి కిక్ ఇచ్చాయి.

అయితే తాజాగా ‘BB3’ టీజ‌ర్‌కి సంబంధించిన యానిమేటెడ్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఎస్ఆర్ఏ1 ఎంట‌ర్‌టైన్‌మెంట్ దీనిని రూపొందిచ‌గా, ఇది కూడా ఫ్యాన్స్‌ని ఎంతగానో అలరిస్తోంది. అయితే ఇప్పటికే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో.. అభిమానులు ఇప్పుడు రాబోయే సినిమా మీద కూడా భారీగా అసలు పెంచుకున్నారు. ఈ చిత్రం సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version