సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్ ఈ రోజు థియేటర్ లలో రిలీజ్ అయింది. ఇందులో జైలర్ గా రజినీకాంత్ నటించిన ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ ఏంటో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించాడు. ఇక రజినీకాంత్ సరసన తమన్నా హీరోయిన్ గా చేసింది. ఇంకా పూర్తి రివ్యూ రావాల్సి ఉండగా సినిమా గురించి ఒక కీలక విషయం వైరల్ గా మారింది. ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన అనిరుద్ రవిచందర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారట, ఇతను అందించిన సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ కాగా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్ లో ఉందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అనిరుద్ రవిచందర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
జైలర్” మూవీలో అనిరుద్ మ్యూజిక్ కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్ !
-