Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత ఉండి లబ్ధి పొందనటువంటి రైతులు ఈనెల 20వ తేదీలోగా గ్రీవెన్స్ లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు స్పష్టం చేశారు. పరిశీలన ధ్రువీకరణలో రిజెక్ట్ అయిన దరఖాస్తులు ఈ-కేవైసీ చేసుకోక తిరస్కరణకు గురైన రైతులు రైతు సేవ కేంద్రాలలో నమోదు చేసుకోవాలని వెల్లడించారు. కాగా గత నెల 27 వరకు స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి, అర్హులను గుర్తించి నిధులను జమ చేసినట్లుగా వెల్లడించారు.

ఇదిలా ఉండగా… ఏపీలోని మహిళలకు శుభవార్త అందజేసింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. దీనిని ఆగస్టు 15వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ప్రారంభించారు. దీంతో ఏపీలోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.