నటసింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ కొత్త లుక్ తో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. తాజాగా మోక్షజ్ఞ ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులో అతను చాలా హ్యాండ్సమ్ గా, సన్నగా కనిపించారు. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తారని గతంలోనే అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అయినప్పటికీ ఈ సినిమా ఇంతవరకు షూటింగ్ ప్రారంభం కానట్లుగా తెలుస్తోంది.

అయితే బాలకృష్ణనే స్వయంగా తన కుమారుడి సినిమాకు దర్శకత్వం వహిస్తారని టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అయింది. మరి ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తారో తెలుసుకోవాలని తన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందమూరి నరసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు. మోక్షజ్ఞ ఒకప్పటికన్నా ఇప్పుడు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారని అంటున్నారు. సినీ పరిశ్రమలోకి మోక్షజ్ఞ అడుగుపెట్టినట్లయితే పెద్ద హీరో తప్పకుండా అవుతారని అంటున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
Ma Nandamuri Balakrishna Gari VARASUDU Nandamuri Taraka Rama Mokshagna Teja..❤️ pic.twitter.com/uy9puzIWpU
— 𝗠𝗮𝗵𝗮𝗿𝗮𝗮𝗷 𝗡𝗕𝗞🦁 (@Maharaaj_NBK) August 18, 2025