50వ వసంతంలోకి అన్నపూర్ణ స్టూడియోస్..నాగార్జున స్పెషల్ వీడియో రిలీజ్

-

అలనాటి మేటి నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ నేటితో 50 వసంతాలను పూర్తి చేసుకున్నది. ఈ క్రమంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ గొప్పతనం, అసలు ఇది ఎలా మొదలైంది. ఇంత వరకు ఎలా వచ్చింది? ఈ స్టూడియోకు అన్నపూర్ణ అనే పేరు ఎలా వచ్చిందని తెలిపే ఓ వీడియో సందేశాన్ని అక్కినేని నాగార్జున విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1975లో అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఫౌండే‌షన్ స్టోన్ వేసినట్లు తెలిపే పిక్స్‌ను వీడియోలో చూపించారు. ఈ స్టూడియోకు తన అమ్మగారి పేరును నాన్నగారు పెట్టారని నాగార్జున పేర్కొన్నారు. చెన్నై నుంచి ఫిలిం ఇండస్ట్రీ తరలివచ్చాక హైదరాబాలో దీని నిర్మాణాన్ని ఏఎన్‌ఆర్ చేపట్టారని ఆయనతో పాటు ఉన్న వ్యక్తులు గుర్తుచేసుకున్నారు.స్టూడియోలో పనిచేసే స్టాఫ్.. వారు స్టాఫ్ కాదని, తమ కుటుంబ సభ్యులు అని నాగార్జున చెప్పుకొచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news