అమరావతి : అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం పెట్టింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో సరఫరా అవుతోన్న మద్యం నాసి రకంగా ఉండి.. ప్రాణాంతకంగా మారుతున్నాయనే అంశంపై చర్చ కోరుతూ టీడీపీ వాయిదా తీర్మానం పెట్టింది. ఇందులో భాగంగానే ఇవాళ జంగారెడ్డి గూడెం వెళ్లనుంది టీడీపీ ఎమ్మెల్యేల బృందం. ఇటీవల మరణించిన మృతుల కుటుంబాలను పరామర్శించనుంది టీడీపీ ఎమ్మెల్యేల బృందం.
ఇక ఇవాళ ఉదయం అసెంబ్లీ సమీపంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన తెలిపారు. కల్తీ నాటు సారాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం విడుదల చేసే మద్యం వల్ల వందలాది మంది చనిపోతున్నారంటూ నినాదాలు చేశారు.
వరుసగా ఐద రోజూ లోకేష్ ఆధ్వర్యంలో టీడీఎల్పీ నిరసన తెలిపారు. సీఎం జగన్ చిత్రపటాన్ని మద్యంతో అభిషేకం చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటో పై మద్యం పోసి నిరసన తెలిపారు. మద్య నిషేదం హామీ గోవిందా గోవిందా అని నినాదాలు చేశారు. కల్తీసారాతో పాటు జె బ్రాండ్లతో ప్రాణాలు తీస్తున్నారని ప్లకార్డులు ప్రదర్శన చేశారు నేతలు.