ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ ఎన్నో అద్భుతమైన పథకాలను అందిస్తుంది..వాటితో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో కొత్త పాలసిని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ‘ధన్ సంచయ్’ పేరుతో తీసుకొచ్చిన ఈ పాలసీలో వినియోగదారులకు మొత్తం 4 రకాల ఆప్షన్స్ అందించింది. ఈ పాలసీ తీసుకున్న వారికి లోన్‌తోపాటు గ్యారెంట్ ఇన్‌కమ్ కూడా అందిస్తోంది. A,B,C,D అనే ఆప్షన్స్‌లో ఈ పాలసీని అందిస్తున్నారు.
పాలసీదారు మధ్యలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తారు. పాలసీ 5 నుంచి 15 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుంది. డెత్ బెనిఫిట్స్ ఒకేసారి లేదంటే ఐదేళ్ల పాటు వాయిదా పద్ధతిలో చెల్లిస్తారు. ఇది నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజువల్, సేవింగ్ ప్లాన్.. ఇందులో ఉండే నాలుగు ప్లానుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..A, B ఆప్షన్స్‌లో హామీ మొత్తం కనీసం రూ. 3,30,000, ఆప్షన్ C లో రూ. 2,50,000, D లో రూ. 22,00,000గా ఉంటుంది..
ఈ పాలసిని తీసుకోవడానికి పాలసీదారుడు వయస్సు కనీసం మూడేళ్లు ఉండాలి..గరిష్ట వయోపరిమితి A, Bలకు 50 సంవత్సరాలు, Cకి 65 సంవత్సరాలు, D పరిమితి 40 సంవత్సరాలు. ఇక పాలసీ తీసుకోవాలనుకునే వారు ఏడాదికి కనీస ప్రీమియంగా రూ. 30,000గా ఉంది. 5, 10 లేదా 15 సంవత్సరాల పాలసీ వ్యవధిని ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. ఇక ఈ ప్లాన్‌లో కనిష్టంగా రూ. 2.5 లక్షలు గరిష్టంగా రూ. 22 లక్షలవరకు పొందవచ్చు.. ఇందులో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి నష్టాలు ఉండవు.. అందుకే ఈ కంపెనీ అందిస్తున్న పథకాలకు మంచి డిమాండ్ ఉంది.. ఈ ప్లాన్ లో ఇప్పుడే ఇన్వెస్ట్ చెయ్యండి మంచి లాభాలను పొందండి..మంచి లాభాలను అందుకోండి..