తెలంగాణ‌లో మ‌రో అనిమ‌ల్ వాక్సిన్ యూనిట్‌

-

తెలంగాణ రాష్ట్రం రోజు రోజుకు పెట్టుబడులలో ముందుకు సాగుతుంది. సోమ‌వారం మ‌రో భారీ పెట్టుబ‌డికి సంబంధించిన హైద‌రాబాద్ శివారులోని జీవోన్ వ్యాలీలో అనిమ‌ల్ వాక్సిన్ త‌యారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఇండియ‌న్ ఇమ్యూనోలాజిక‌ల్స్ లిమిటెడ్ (ఐఐఎల్‌) ముందుకు వ‌చ్చింది. ఈ యూనిట్ కోసం ఐఐఎల్ ఏకంగా రూ.700 కోట్ల‌ను పెట్టుబ‌డిగా పెట్ట‌నుంది. ఈ మేర‌కు సోమ‌వారం హైద‌రాబాద్ వ‌చ్చిన ఐఐఎల్ ఎండీ ఆనంద‌ర్ కుమార్ త‌న ప్ర‌తినిధి బృందంతో రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వారు హైద‌రాబాద్‌లో త‌మ నూత‌న పెట్టుబ‌డి ప్ర‌తిపాద‌న‌ల‌ను కేటీఆర్‌కు తెలిపారు.

 

కొత్త‌గా జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయ‌నున్న త‌న త‌దుప‌రి యూనిట్‌లో ఏడాదికి మ‌రో 300 మిలియ‌న్ యూనిట్ల వాక్సిన్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌నుంది. ఇప్ప‌టికే గ‌చ్చిబౌలిలో ఐఐఎల్‌కు ఓ అనిమ‌ల్ వాక్సిన్ ప్లాంట్ ఉంది. ఇందులో ఏడాదికి 300 మిలియ‌న్ వాక్సిన్ డోసుల‌ను ఆ సంస్థ ఉత్ప‌త్తి చేస్తోంది. రూ.700 కోట్ల పెట్టుబ‌డితో ఏర్పాటు చేయ‌నున్న ఈ యూనిట్ ద్వారా రాష్ట్రంలో 750 మందికి పైగా ఉపాధి లభించ‌నుంద‌ని కేటీఆర్ చెప్పారు. ఇప్ప‌టికే వాక్సిన్ కేపిట‌ల్ ఆఫ్ వ‌రల్డ్‌గా ప్ర‌సిద్ధిచెందిన హైద‌రాబాద్‌లో ఐఐఎల్ మ‌రో వాక్సిన్ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version