ఇండియన్ సినిమాలో ఎంతోమంది సంగీత దర్శకులు తమవైన ట్యూన్స్ తో ఆడియన్స్ హృదయాలను శాశ్వతంగా ట్యూన్ చేశారు. అలాంటివారిలో టాప్ 15 మేటి మ్యూజిక్ మెజీషియన్ల వివరాలను అందిస్తున్నాం. మలయాళం ఇండస్ట్రీకి చెందిన గోపీ సుందర్ సినిమాకు కోటి తీసుకుంటారు తెలుగులో మజ్ను నిన్ను కోరి గీత గోవిందం లాంటి సినిమాలకు స్వరాలు అందించారు.
ఇష్క్ గుండెజారి గల్లంతయ్యిందే సోగ్గాడే చిన్నినాయనా వంటి ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చాడు అనూప్ రూబెన్స్ ప్రతీ సినిమాకు మినిమమ్ ఇచ్చే అనూప్ 80 లక్షల నుండి కోటి వరకు వసూలు చేస్తున్నారు. ఈ యంగ్ స్టర్ ఇటు మ్యూజిక్ అటూ యాక్టింగ్ తో అలరిస్తున్నారు తమిళ్ లో అసురన్ ఆకాశం నీ హద్దురా తెలుగులో డార్లింగ్ వంటి చిత్రాలకు ఆల్బమ్స్ ఇచ్చిన జివి ప్రకాష్ సినిమాకు 3 నుండి 4 కోట్లు తీసుకుంటారు.
బృందావన కాలనీ, పంజా ఓయ్ ఆవారా వంటి ఎన్నో చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించారు యువన్ శంకర్ రాజా ఇప్పటికీ తమిళ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న యువన్ సినిమాకు 3 నుండి 5 కోట్ల వరకు తీసుకుంటారు. తెలుగులో ఆరెంజ్ వాసు ఘర్షణ సైనికుడు వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చారు హారిస్ జయరాజ్ సినిమాకు 3 కోట్లు పక్కా తీసుకుంటారు.
ప్రభాస్ సాహో మూవీకి బీజీఎం వర్క్ చేసిన జిబ్రాన్ తెలుగులో జిల్ వంటి సినిమాలకు పనిచేశారు సినిమాకు కోటి రూపాయలు తీసుకుంటారు. కోలీవుడ్ లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్నవాడు హిప్ హాప్ తమిజా టాలీవుడ్ లో ధృవ కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలకు సూపర్ మ్యూజిక్ ఇచ్చిన తమిజా సినిమాకు కోటి అందుకుంటారు.
ఈతరం సంగీత దర్శకుల్లో అద్భుతమైన మెలోడీకి కేరాఫ్ మిక్కీ జె మేయర్ హ్యాపీడేస్ కొత్త బంగారులోకం శతమానం భవతి వంటి ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన మిక్కీ సినిమాకు కోటి తీసుకుంటారు. కబాలి, కాలా, సర్పత వంటి హిట్ చిత్రాలకు అదిరిపోయే సాంగ్స్ ఇచ్చిన సంతోష్ నారాయణన్ సినిమాకు 2 కోట్లు తీసుకుంటారు. సౌత్ ఇండియాలో దుమ్ము లేపుతున్న థమన్ సినిమాకు 5 కోట్లు వసూలు చేస్తున్నారు.
ఈ యువతరంగం ట్యూన్స్ ఇస్తే ఖచ్చితంగా హిట్ అన్నట్టుగా ఉంది పరిస్థితి అజ్ఞాతవాసి విక్రమ్ వంటి చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్ రవి చందర్ సినిమాకు 5 నుంచి 6 కోట్లు తీసుకుంటారు. టాలీవుడ్ మెలోడీ బ్రహ్మ టైటిల్ కార్డ్ పొందిన మణిశర్మ గురించి చెప్పేదే ముంది ఆల్ టైమ్ బెస్ట్ లో తప్పక ఉండే మణి సినిమాకు 2 కోట్ల వరకు తీసుకుంటారు. టాలీవుడ్ మెలోడీ బ్రహ్మ టైటిల్ కార్డ్ పొందిన మణిశర్మ గురించి చెప్పేదే ముంది ఆల్ టైమ్ బెస్ట్ లో తప్పక ఉండే మణి సినిమాకు 2 కోట్ల వరకు తీసుకుంటారు.
తెలుగులో రాక్ స్టార్ ట్యాగ్ లైన్ తో ఆడియన్స్ ను ఉర్రూతలూగించే కెపాసిటీ డీఎస్పీ సొంతం ఎన్నో ట్రేడ్ మార్క్ ఆల్బమ్స్ ఇచ్చిన దేవీశ్రీప్రసాద్ సినిమాకు 3 నుంచి 5 కోట్లు తీసుకుంటారు. రోజా చిత్రంతో ప్రయాణం మొదలు పెట్టి ఇప్పటికీ వన్నెతగ్గని మ్యూజిక్ అందిస్తున్నారు రెహమాన్ ఆల్ టైమ్స్ లో అగ్రభాగాన ఉండే ఆయన సినిమా బడ్జెట్ ఆధారంగా 8 నుండి 10 కోట్లు తీసుకుంటారు.