బందరుని వణికించిన మర్డర్ అటెంప్ట్…!

-

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మరో హత్యా ప్రయత్నం కలకలం రేపింది. నాలుగు నెలల క్రితం వైసీపీ నేత మోకా భాస్కరరావుని టార్గెట్ చేసి మర్డర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మార్కెట్ యార్డ్ చైర్మన్ కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పింటించారు కొందరు దుండగులు. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఇంట్లోనే ఈ ఘటన జరిగింది.

దీనితో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ కలహాలా..? రాజకీయ కారణాలా అనే కోణంలో విచారిస్తున్న పోలీసులకు ఎలాంటి సాక్ష్యం దొరకలేదు. కుటుంబ సభ్యులు ప్రమేయం పై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అతని సన్నిహితులను కూడా పోలీసులు పిలిచి విచారిస్తున్నారు. అలాగే అధికార పార్టీ, విపక్షాలకు చెందిన నేతలను కూడా విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version