ఈ మధ్యకాలంలో నకిలీ దందా లు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఏదో ఒక విధంగా మాయమాటలు చెప్పి ప్రజలను బురిడీ కొట్టించి భారీగా డబ్బులు దండుకుంటున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. అయితే రోజురోజుకు ఇలా సాగుతున్న నకిలీ దందాపై ఉక్కుపాదం మోపి పోలీసులు అరెస్టు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఏకంగా పోలీసుల వేషంలోనే ప్రజలను బురిడీ కొట్టించడం ప్రారంభించారు. బెజవాడలో నకిలీ పోలీస్ దండ రోజురోజుకు పెరిగిపోతోంది.
దీంతో ప్రజలు అందరూ ఎవరు నకిలీ పోలీస్ ఎవరు నిజమైన పోలీస్ అని తెలుసుకోలేక వణికిపోతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ను టార్గెట్ చేసుకున్న కొంతమంది కేటుగాళ్లు ఏకంగా తమ గ్యాంగ్ లోని కొందరిని డ్రగ్స్ విక్రేతలు గా విద్యార్థులను ఆకర్షించి ఆ తరువాత మరికొంత మంది పోలీసులు గా ఎంట్రీ ఇచ్చి విద్యార్థులను బెదిరింపులకి పాల్పడి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇన్ని రోజుల వరకు ఎంతో రహస్యంగా సాగిన నకిలీ పోలీస్ దందా ఇటీవల ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బట్టబయలైంది. రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ పోలీసులను అరెస్టు చేశారు.