ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరో చార్జ్ షీట్

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణాణం చోటు చేసుకుంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో.. మనీష్ సిసోడియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. దాదాపు 2500 పేజీల చార్జిషీటును దాఖలు చేసింది. ఎక్సైజ్ పాలసీలో సిసోడియాపై సీబీఐ కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మార్చి 9న సిసోడియాను ఈడీ అరెస్టు చేసింది. అంతకు ముందు సుదీర్ఘ విచారణ తర్వాత.. ఫిబ్రవరి 26న సీబీఐ అతన్ని అరెస్టు చేసింది. ఈ కేసులో మనీష్ సిసోడియా 29వ నిందితుడిగా ఉన్నారు.

లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితనే ముడుపులు ఇచ్చారని ఆరోపించింది ఈడీ. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కవిత తమ బినామీల ద్వారా వ్యాపారం చేశారని తెలిపింది. లిక్కర్ లాభాలతో అరుణ్ పిళ్లై ద్వారా కవిత భూములు కొనుగోలు చేశారని చెప్పింది. తనకున్న పలుకుబడితో హైదరాబాద్ లో తక్కువ ధరకే కవిత భూములు కొన్నారని తెలిపింది. భూముల కొనుగోలు లావాదేవీలన్నీ అరుణ్ పిళ్లై బ్యాంక్ ఖాతా ద్వారానే జరిగినట్లు చెప్పింది. లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన జ్యూడిషియల్ కస్టడీని మే 8 వరకు పొడిగించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version