అధికారులకు జైలుశిక్ష విధించిన ఏపీ హైకోర్టు

-

ఏపీ హై కోర్టు పలువు ఉన్నత అధికారుల పై జరుపుతున్న విచారణ విషయం గురుంచి తెలిసిందే. ఆర్టీసీలో ఫీల్డ్ మన్లను క్రమబద్ధీకరించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది. అయితే తమ ఆదేశాలను అమలు చేయకపోవడం హైకోర్టును వారి పై మండిపడింది.

ఈ నేపథ్యంలో, ఐదుగురు అధికారులకు జైలు శిక్ష విధిస్తున్నట్లు ఏపీ హైకోర్టు తెలియపరిచింది. ఈ నెల 2వ తేదీన ఆదేశాలు వెలువరించింది కోర్టు. రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుకు నెల రోజుల జైలుశిక్ష విధించింది. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో పాటు మరో ముగ్గురు ఉన్నతాధికారులకు కూడా నెల రోజుల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ ఐదుగురు అధికారులకు రూ.1000 చొప్పున జరిమానా విధించినాట్లు సమాచారం.

హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఫీల్డ్ మన్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు పైవిధంగా తీర్పు ఇచ్చింది. ఈ నెల 16 లోపు రిజిస్ట్రార్ జనరల్ వద్ద లొంగిపోవాలని సదరు అధికారులకు వెల్లడించింది ఏపీ హై కోర్టు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version