తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేది ఏ పార్టీ? తన పేరులో తెలంగాణకు బదులుగా భారత్ అని మార్చుకున్న అధికార బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించేనా? లేదంటే డబుల్ ఇంజన్ సర్కారు అని నినదిస్తూ హస్తినలోనే కాదు ఇక తెలంగాణలోనూ పాగా వేస్తామంటున్న బిజెపి ఆశలు ఫలించేనా? ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ వరుసగా రెండు పర్యాయాలు నెగ్గలేకపోయిన కాంగ్రెస్ మూడో ప్రయత్నంలో అయినా గెలిచేనా? అనేవి సగటు ఓటరులో ఉన్న సందేహాలు.
ఈ నేపధ్యం లో సీఎం కేసీఆర్పై పోటీ చేయడానికి తాను సిద్ధమని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ను చూసి ఇక్కడ ఎవరు బయపడడం లేదని ఆయన తెలిపారు. మే 4వ తేదీ గురువారం ఖమ్మంలోని పొగులేటి శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో బీజేపీ ముఖ్యనేతలతో సమావేశమైయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పొంగులేటి.. తెలంగాణ వస్తే మంచి జరుగుతదని కలలు కన్న తెలంగాణ బిడ్డల ఆలోచనల్ని, ఆశయాలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని మండిపడ్డారు.