చైనాలో మరో వ్యాధి.. కరోనా తరహాలోనే..?

-

చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది కరోనా వైరస్. అయితే ప్రపంచ దేశాల్లో ఈ మహమ్మారి వైరస్ విజృంభిస్తున్నప్పటికీ… ఈ వైరస్కు పుట్టినిల్లయిన చైనాలో మాత్రం పూర్తిగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. చైనా కరోనా వైరస్ నుంచి కోలుకుని లాక్ డౌన్ నిబంధనలు కూడా సడలించింది. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం చైనాలో మరో సరికొత్త వ్యాధి అందరిని భయపెడుతుంది.

శరవేగంగా విస్తరిస్తూ ఎంతో మందికి భయాందోళన కలిగిస్తుంది సరికొత్త వ్యాధి . బ్రూసెల్లోసిస్ అనే సరికొత్త వ్యాధి చైనాలోని గన్స్యూ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఏకంగా మూడు వేల మందికి పైగా వ్యాపించింది ఈ మహమ్మారి వైరస్. బ్రూసెల్లా అనే వైరస్ కారణంగా స్థాపించే ఈ వ్యాధి బారినపడి ఇప్పటికే ఎంతోమంది ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే ఈ వ్యాధి వస్తే తలనొప్పి కండరాల నొప్పి జ్వరం కీళ్ల నొప్పులు ఆకలి వేయకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని అక్కడి వైద్య నిపుణులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version