తెలంగాణ, ఏపీకి కేంద్రం మరో శుభవార్త… వైద్య రంగానికి రుణాలు

-

లంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. రెండు రోజుల కింద పన్నుల వాటా నిధులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం… వైద్య రంగానికి రుణ సదుపాయం కల్పించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశంలోని 13 రాష్ట్రాల్లో ప్రాథమిక వైద్య సేవల విస్తరణకు మోడీ సర్కార్ ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి..రూ. 2223 కోట్ల రుణం తీసుకోవడానికి ఒప్పందం చేసుకుంది.

ఈ కీలక నిర్ణయం కారణంగా ఆయా రాష్ట్రాల్లోనీ… పట్టణప్రాంత మురికివాడల్లో నివసించే ఐదు కోట్ల మందికి మేలు జరుగుతుందని స్పష్టం చేసింది కేంద్ర ఆర్థిక శాఖ. బుధవారం ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు అధికారులు. ఈ రుణాన్ని ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాలు మిషన్ కు వినియోగించనున్నట్లు ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ప్రాథమిక వైద్య ఆరోగ్య సేవలను విస్తరించి… పేదలకు సులభంగా అందుబాటులో ఉండేలా చేస్తామని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు కర్ణాటక, చత్తీస్గడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలు లబ్ధి పొందే రాష్ట్రాల లిస్టులో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version