ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది.గుంటూరు ప్రజలు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలకు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సొల్యూషన్ తీసుకొచ్చారు. ట్రాఫిక్ కష్టాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషించే శంకర్ విలాస్ వంతెన (ఆర్ఓబీ)ని నాలుగు లేన్లుగా విస్తరించడానికి కేంద్రం మద్దతు ప్రకటించింది.ఈ క్రమంలోనే సీఆర్ఐఎఫ్ పథకం కింద రూ. 98 కోట్లను మంజూరు చేస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతా వేదికగా ప్రకటించారు.
దీంతో శంకర్ విలాస్ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్న నగర ప్రజలకు మొత్తానికి రిలీఫ్ లభించినట్లు అయ్యింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పెమ్మసాని నేతృత్వంలో గుంటూరు ఎంపీ నియోజకవర్గానికి ప్రాజెక్టులు, పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. రీసెంట్‌గా అమరావతికి రూ.250 కోట్ల విలువైన టెక్నాలజీ సెంటర్ రాగా, ప్రత్తిపాడు సెగ్మంటులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.