ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందజేసింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మరో రైల్వే ట్రాక్ నిర్మాణం ట్రయల్ రన్ పూర్తయ్యింది. గూడూరు నుంచి విజయవాడ మధ్యలో నూతనంగా నిర్మిస్తున్న 3వ లైన్ రైల్వే పనులు వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే 293KM లైన్లో 251KM పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పూర్తయిన ప్రాంతంలో 140KM వేగంతో రైలు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో రైల్వేలో ప్రయాణికులు అధికంగా వెళ్తుంటారు. ఉపాధి పరంగా కూడా ఈ రైల్వే లైన్ సామాన్యలను ఎంతగానో ఉపయోగపడనుంది. దీనికి తోడు సమయానికి రైల్లు నడిచే విధంగా.. రద్దీని నిలువరించేందుకు మూడో ట్రాక్ నిర్మాణాన్ని కేంద్ర రైల్వే శాఖ చేపట్టిన విషయం తెలిసిందే.