హరీష్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన 50 మంది బీజేపీ నేతలు

-

మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన 50 మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు చేరారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ… తెలంగాణను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.. తెలంగాణకు అన్యాయం తప్ప ఏం చేయలేదన్నారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రారంభించిన బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని ఫైర్ అయ్యారు.


జహీరాబాద్ నియోజకవర్గానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, సంగారెడ్డి జిల్లా అభివృద్ధిని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తయితే జిల్లా మొత్తం సాగునీటితో సస్య శ్యామలం అవుతుంది… బసవేశ్వర ప్రాజెక్టు పూర్తి చేయడానికి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. తాగు, సాగునీరు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news